ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి దీక్ష | Lover Protest Infront of Boyfriend in Mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి దీక్ష

Jun 23 2020 12:07 PM | Updated on Jun 23 2020 12:07 PM

Lover Protest Infront of Boyfriend in Mahabubnagar - Sakshi

అనిత

ఊర్కొండ: ప్రేమించిన్నట్లు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన అబ్బాయి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష చేపట్టిన సంఘటన సోమవారం ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన అనిత 5ఏళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో పని చేసేది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అవుతున్న ఆంజనేయులు ప్రేమిస్తున్నాడని నమ్మించాడు. అన్ని విధాలావాడుకోని వదిలేశాడు. చివరకు పెళ్లి చేసుకోమని అమ్మాయి అడిగితే మొహం చాటేశాడు. దీంతో అమ్మాయి అతని ఇంటి ముందు దీక్షకు చేపట్టింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement