కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి | Landslides kill Nine People In Manipur | Sakshi
Sakshi News home page

Jul 11 2018 1:23 PM | Updated on Jul 11 2018 1:25 PM

Landslides kill Nine People In Manipur - Sakshi

ఇంపాల్‌: మణిపూర్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున తమెంగ్లాంగ్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించిన సహాయక సిబ్బంది మిగిలిన ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కుండపోత వర్షాలు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి.

వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత జూన్‌లో కురిసిన వర్షాలకు త్రిపుర, మణిపూర్‌, అస్సాంలలో కొండ చరియలు విరిగిపడి చాలా రోడ్లు బ్లాక్‌ అయ్యాయి. ఆర్మీ, పారామిలటరీ బలగాలు అక్కడికి చేరి వారికి అండగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement