వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్‌! | Kandukuru Siva Reddy Murder Accuse Sake Balakrishna arrested in Bangalore | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్‌!

Oct 7 2019 4:51 PM | Updated on Oct 7 2019 5:20 PM

Kandukuru Siva Reddy Murder Accuse Sake Balakrishna arrested in Bangalore - Sakshi

అనంతపురం, సాక్షి :  వైఎస్సార్‌సీపీ కార్యకర్త కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాకే బాలకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివారెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, పరిటాల సునీత వర్గీయుడు సాకే బాలకృష్ణను సోమవారం బెంగళూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొహరం పండుగ సందర్భంగా కందుకూరులో జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డి గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై ఇటుకుల పల్లి నుంచి కందుకూరు వెళుతున్న అతడిని... దుండగులు కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారు.
చదవండిఅట్టుడికిన అనంత


హత్యకు గురైన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త శివారెడ్డి (ఫైల్‌ ఫోటో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement