బాధిత రైతులకు న్యాయం చేస్తా

Justice To The Affected Farmers - Sakshi

తల్లాడ: తన కుమారుడు రైతుల వద్ద నుంచి మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టినందువల్ల కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న మిర్చిని విక్రయించి రైతులకు పంపిణీ చేస్తానని, మిగిలిన పైకం కూడా తన ఆస్తులను అమ్మైనా చెల్లిస్తానని అఖిల పక్షానికి జలంధర్‌ తండ్రి ఎస్‌బీ ప్రసాద్‌ హామీ పత్రం రాసి ఇచ్చారు.

తల్లాడ శ్రీరామా, శ్రీ కృష్ణ కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో కొంత మిర్చి తన కుమారుడు ఉంచాడని, అది విక్రయించగా మిగిలిన సొమ్మును తన స్తోమత మేరకు చెల్లిస్తానన్నారు. గత నాలుగు రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో  ఐపీ వ్యాపారి జలంధర్‌ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారి తండ్రి దిగి వచ్చి అఖిల పక్షానికి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, బాధిత రైతులు గద్దె అశోక్, కొండల్‌రావు, కోయిన్ని వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వరరావు, పడాల లక్ష్మయ్య, నాగేంద్రబాబు, గొడుగునూరి లక్ష్మారెడ్డి, యరమల నాగార్జున్‌రెడ్డి, వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రెడ్డెం రామకృష్ణ, కుప్పాల రామకోటయ్య, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top