ఐఐటీ విద్యార్థి అనుమానస్పద మృతి.. | IIT Kharagpur student dies after falling off building | Sakshi
Sakshi News home page

ఐఐటీ విద్యార్థి అనుమానస్పద మృతి..

Oct 22 2017 1:40 PM | Updated on Oct 22 2017 1:40 PM

సాక్షి, కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో శనివారం ఓ విద్యార్థి అనుమానస్పందంగా మృతి చెందారు. నిఖీల్‌ భాటియా(23) అనే మైనింగ్‌ ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థి క్యాంపస్‌లోని లాల్‌బహదూర్‌ హాల్‌ ముందు రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే క్యాంపస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించనట్లు డాక్టర్లు తెలిపారు.

అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యనా.. ఎవరైనా బిల్డింగ్‌పై నుంచి తోసేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నిఖీల్‌ బ్రిలియంట్‌ విద్యార్థి అని, ముంబైలోని వారి తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చినట్లు క్యాంపస్‌ అధికారులు పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement