రూ. 1.50 కోట్ల గుట్కా స్వాధీనం | Hyderabad Police Arrest 4 Members For Illegally Transport Gutka | Sakshi
Sakshi News home page

నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్‌

May 6 2019 7:12 PM | Updated on May 6 2019 8:33 PM

Hyderabad Police Arrest 4 Members For Illegally Transport Gutka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుట్టు చప్పుడు కాకుండా నగరానికి గుట్కా తరలిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ‘దాదాపు రూ. కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే గుట్కాను సీజ్‌ చేశాము. గుట్కాను వేరే పేర్లతో ప్యాక్‌ చేసి అక్రమంగా రైల్లో తరలిస్తుండగా పట్టుకున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌, షబ్బీర్‌ మొయినుద్దీన్‌, సయ్యద్‌ జబీర్‌ మహ్మద్‌, సయ్యద్‌ మహ్మద్‌లు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నార’ని తెలిపారు.

‘ఈ ముఠా రెండు వాహనాల్లో ఆరు రకాల గుట్కా పదార్థాలను తరలించే ప్రయత్న చేశారు. వీరిని అరెస్ట్‌ చేసి.. గుట్కా పదార్థాలను సీజ్‌ చేశాము. అయితే ఈ గ్యాంగ్‌కు అవాల అభిషేక్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2004 నుంచి అతను ఈ వ్యాపారం చేస్తున్నాడు. గతంలోనే అభిషేక్‌ మీద బీబీ నగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి’ని అంజనీ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement