జయరాం కేసు తెలంగాణకు బదిలీ : సీపీ

Hyderabad CP Anjani Kumar Said Jayaram Murder Case Transfer To Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ  స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. (శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య)

తమపై జయరాం భార్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కేసుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతామన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్‌ అయిన వారిలో ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను వెలుగుతీస్తామని సీపీ పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top