తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిఖా ప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు.