పెనుభూతమైన అనుమానం..! | Husband Killed Wife in Chaithanyapuri Hyderabad | Sakshi
Sakshi News home page

పెనుభూతమైన అనుమానం..!

Jan 17 2019 9:12 AM | Updated on Jan 17 2019 9:39 AM

Husband Killed Wife in Chaithanyapuri Hyderabad - Sakshi

భార్య శ్వేత, పిల్లలతో రాము

సాక్షి, హైదరాబాద్‌: అనుమానం పెనుభూతమైది. భార్యపై అనుమానంతో ఓ భర్త మద్యం తాగివచ్చి ఆమెను గొంతు నులిమి హతమార్చి పరారయ్యాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. ఆటో డ్రైవర్‌ రాము అదేకాలనీకి చెందిన శ్వేత అలియాస్‌ సోని (25)ని తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 8, 6 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు, మూడు సంత్సరాల ఒక కుమారుడు ఉన్నారు. ఆటో నడపగా వచ్చిన డబ్బుతో రాములు నిత్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు.

అంతేకాకుండా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాము భార్యతో గొడవపడి గొంతు నులిమి చంపి పరారయ్యాడు. మంగళవారం ఉదయం పక్క ఇంట్లో ఉండే తోటికోడలు నర్సమ్మ వచ్చి శ్వేతను పిలిచింది.. ఆమెలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అత్త, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారంతా వచ్చి చూడగా అప్పటికే శ్వేత మృతిచెంది ఉంది. మెడపై గాట్లు ఉండటంతో భర్త రాము ఆమెను హతమార్చి పరారై ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు శ్వేత తండ్రి ఫిర్యాదు మేకు కేసు నమోదు చేశారు.

నా కొడుకుని ఉరి తీయండి..
కోడల్ని గొంతు నులిమి చంపిన తన కొడుకు రామును ఉరి తియ్యాలని తల్లి డిమాండ్‌ చేసింది. నా కోడలు బంగారమని, పెళ్లైన దగ్గర నుంచి నిత్యం కొడుతూ చిత్ర హింసలు పెట్టేవాడని వాపోయింది.  తల్లి హత్యకు గురి కావటం, తండ్రి పరారు కావటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఏం జరిగిందో తెలియక అమాయంకంగా కూర్చున పిల్లలను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement