అగ్గిపెట్టెల్లో ఉంచి గుట్కా విక్రయం

Gutka Sales in match Box Tamil Nadu - Sakshi

చెన్నై, తిరువొత్తియూరు: అగ్గిపెట్టెలలో హాన్స్, పాన్‌పరాగ్‌ వంటి ప్రభుత్వ నిషేధించిన మత్తు పదార్థాలను ఉంచి విక్రయిస్తున్న దుకాణం యజమానిని పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై, సెయింట్‌ థామస్‌ మౌంట్‌ మేట్టువీధిలో ఉన్న ఓ ప్రొవిజన్‌ దుకాణంలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు పోలీసు డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ వలర్మతి, ఎస్‌ఐ సెల్వమణి తదితరులతో కూడిన బృందం ఆ ప్రాంతంలో నిఘా ఉంచారు.

ఆ సమయంలో మధ్యస్థనగర్‌లో ఉన్న ఓ ప్రొవిజన్‌ దుకాణానికి యువకులు ఎక్కువమంది వచ్చి వెళుతున్నట్టు తెలిసింది. పోలీసులు ఆ దుకాణానికి వెళ్లి తనిఖీ చేశారు. దుకాణంలో పేర్చి ఉన్న అగ్గిపెట్టెలలో ప్రభుత్వం నిషేధించిన మత్తుపదార్థాలు ఉన్నట్టు తెలిసింది. వాటిలో హాన్స్, పాన్‌పరాగ్‌ తదితర మత్తు పదార్థాలు ఉంచి రహస్యంగా విక్రయిస్తున్నట్టు తెలిసింది. దుకాణం యజమాని అబ్బాస్‌ (28)ని పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top