
సాక్షి, అహ్మదాబాద్ : మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌లో రూ కోటి విలువైన మద్యం నిల్వలను నగరంలోని రామోల్‌లో బుధవారం గుజరాత్ పోలీసులు ధ్వంసం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యం తయారీ, వినియోగం, రవాణాలపై నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర నుంచి 1960లో గుజరాత్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉంది.
అప్పటినుంచి రాష్ట్రంలో మద్యం తయారీ, క్రయవిక్రయాలు, మద్యం రవాణాపై పూర్తినిషేధం అమల్లో ఉన్నా మద్యం మాఫియా పరిశ్రమగా ఎదిగింది. అక్రమ మద్యాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోయాయి. తాజాగా రూ కోటి విలువైన మద్యం నిల్వలను పోలీసులు ధ్వంసం చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.