రైలు కింద పడి వరుడు ఆత్మహత్య | Groom Commits Suicide On Railway Track In Tamil Nadu | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వరుడు ఆత్మహత్య

May 26 2018 8:19 AM | Updated on May 26 2018 8:19 AM

Groom Commits Suicide On Railway Track In Tamil Nadu - Sakshi

సేలం: తెల్లారితో వివాహం జరగాల్సిన స్థితిలో రైలు కిందపడి వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఈరోడ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. ఈరోడ్‌ జిల్లా ఊంజలూర్‌ సమీపంలో ఉన్న వెంగంపూర్‌ కురంగన్‌ పాళయం రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఉదయం ఒక యువకుడు శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న ఈరోడ్‌ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఊంజలూర్‌ సమీపంలో ఉన్న కాశిళయం ప్రాంతానికి చెందిన షణ్ముగం(70) విశ్రాంత ఉపాధ్యాయుడు.

ఇతనికి ప్రభాకర్‌ (27), విక్కి (అలియాస్‌ విఘ్నేష్‌) (25)అనే కుమారులున్నారు. ప్రభాకర్‌కి వివాహమైన కరూర్‌లో నివసిస్తున్నాడు. విఘ్నేష్‌ మెకానిక్‌ ఇంజినీరింగ్‌ చదివి, చెన్నైలో ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విఘ్నేష్‌కు శుక్రవారం వివాహం చేయడానికి నిశ్చయించారు. ఏర్పాట్లను కొడుముడిలో ఉన్న ఒక కల్యాణ మండపంలో జోరుగా చేశారు. కాగా, వివాహం కోసం కొన్ని రోజుల కిందట చెన్నై నుంచి విఘ్నేష్‌ ఇంటికి వచ్చాడు. గురువారం రాత్రి రైలు కిందపడి విఘ్నేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈరోడ్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement