కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి | Girl Molested By Father In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కన్న కూతురిని దారుణంగా హింసించి..

Nov 4 2019 10:07 AM | Updated on Nov 4 2019 1:07 PM

Girl Molested By Father In Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : నాన్న అనే మాటనే అపవిత్రం చేశాడు ఓ మృగాడు. కన్నకూతురిని దారుణంగా హింసించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... భిండ్‌ ప్రాంతానికి చెందిన బాలిక(16) తల్లిదండ్రులతో కలిసి సిర్సోడా గ్రామంలో నివసిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బాలిక తండ్రి ఆమెను ఓ గదిలో బంధించాడు. ఆమెను తీవ్రంగా కొట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో తల్లి వేరే గదిలో ఉండటంతో బాలిక ఆర్తనాదాలు వినేవారే కరువయ్యారు. అనంతరం కూతురిని వెదుక్కుంటూ అక్కడికి వచ్చిన బాలిక తల్లి జరిగిన దారుణం చూసి నిర్ఘాంతపోయింది. పోలీసులకు ఫోన్‌ చేయాల్సిందిగా సూచించడంతో బాలిక వారిని ఆశ్రయించింది. 

ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ... ‘శనివారం అర్ధరాత్రి తర్వాత బాధితురాలు మాకు ఫోన్‌ చేసింది. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాం. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గాయాలతో సతమతవుతున్న బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి కేసు నమోదు చేశాం. ఆడపిల్లను కన్నదన్న కారణంతో బాధితురాలి తల్లిని కూడా నిందితుడు హింసించేవాడు. ఎలాగైనా తల్లీబిడ్డలను వదిలించుకోవాలని వారిని తీవ్రంగా హింసించేవాడు. ఘటన జరిగిన రోజు కూడా భార్యను కొట్టాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. తొందర్లోనే నిందితుడిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తాం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement