తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడొద్దు అన్నందుకు.. | Girl Commits End Lives in Medak Parents Rejects Boyfriend | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని బాలిక ఆత్మహత్య

Apr 23 2020 10:27 AM | Updated on Apr 23 2020 10:27 AM

Girl Commits End Lives in Medak Parents Rejects Boyfriend - Sakshi

గైని మీనా (ఫైల్‌)

నారాయణఖేడ్‌: బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన  మండలంలోని జూకల్‌లో చోటు చేసు కుంది. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల మేరకు..   గ్రామానికి చెందిన గైని మీనా(17) ఇంట ర్‌  పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్లు సంజీవన్‌రావుపేట్‌కు చెందిన బేగరి శ్రీకాంత్‌తో పరి చయం ఏర్పడింది. తరచుగా అతనితో ఫోన్‌లో మాట్లాడుతూ చాటింగ్‌ చేస్తోంది. రెండు నెలల క్రితం శ్రీకాంత్‌ జూకల్‌లో మీనా ఇంటికి రావడంతో కుటుంబీకులు రావద్దని పంపించి వేశా రు. మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా  మీనా ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి గైని బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.(మూఢనమ్మకాలకు కుటుంబం బలి)

Advertisement
 
Advertisement
Advertisement