దొంగతనం చేశారనే అనుమానంతో..

In Ghaziabad Two Men Tied To Electricity Pole Beaten For Stealing - Sakshi

లక్నో : దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఇద్దరు యువకులను ఎలక్ట్రిక్‌ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఈ  సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. అసిఫ్‌, ఇక్బాల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం మూడు గంటల ప్రాంతంలో రాకేష్‌ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో చొరబడి డబ్బు దొంగలించడానికి ప్రయత్నించరనే అనుమానంతో వారిని బంధించారు. అనంతరం ఎలక్ట్రిక్‌ పోల్‌కు కట్టేసి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మీద దాడి చేసిన వారి మీద కేస్‌ ఫైల్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top