ప్రకాశం జిల్లాలో గ్యాంగ్‌ రేప్‌, హత్య

gang rape in prakasham district - Sakshi

సాక్షి, సంతమాగులూరు:  ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో దారుణం జరిగింది. ఒక మహిళపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆపే హతమార్చి సమీపంలోని వ్యవసాయబావిలో పడేశారు.

బుధవారం ఉదయం మహిళ శవాన్ని బావిలో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాతమాగులూరు గ్రామ సమీపంలో వైష్ణవి గ్రానైట్‌లో కనకమ్మ(35) అనే మహిళ వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. కండువా మెడకు చుట్టి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. శవం పడిఉన్న తీరును గమనించిన స్థానికులు సామూహిక అత్యాచారం జరిగిందని అనుమానిస్తున్నారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో గ్రామస్తులు శవాన్ని వెలికితీసేందుకు సంశయిస్తున్నారు. ఒంటిపై దుస్తులు ఉన్న తీరు, శరీరంపై గాయాలను బట్టి గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top