ప్రియుడిని భయంకరంగా చంపింది.. కానీ! | Female Held In Lover Murder Case In Greater Noida | Sakshi
Sakshi News home page

ప్రియుడిని భయంకరంగా చంపింది!

Jun 25 2018 12:59 PM | Updated on Jun 25 2018 2:06 PM

Female Held In Lover Murder Case In Greater Noida - Sakshi

నోయిడా: ప్రియుడిని బ్లాక్‌ మెయిల్‌ చేసి.. ఆపై దారుణహత్య చేసిన కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగానే కక్ష పెంచుకుని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ధన్‌కౌర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ఫర్మూద్‌ అలీ పండీర్ కథనం మేరకు.. సోనమ్‌ అలియాస్‌ సోను(23), జితేంద్ర(37)లు ధన్‌కౌర్‌లోని లోడిపూర గ్రామానికి చెందినవారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల కిందట సోనమ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వివాహేతర సంబంధాల అనంతరం ఇటీవల వీరిమధ్య మనస్పర్థలొచ్చాయి. అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నీ భార్యకు పంపిస్తానంటూ జితేంద్రను సోనమ్‌ బెదిరించేది. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని జితేంద్ర చెప్పడంతో ప్రియుడి హత్యకు ప్లాన్‌ చేసింది.

పథకం ప్రకారం ఫోన్‌ చేసి బిలాస్‌పూర్‌ ఏరియాకు రావాలని జితేంద్రను కోరింది. జితేంద్ర అక్కడకు రాగానే అంతకుముందే మంచం కోళ్లతో సిద్ధంగా ఉన్న సోనమ్.. అతడి తలపై పలుమార్లు కొట్టగానే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం తన స్కూటర్‌పై సోనియా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

జితేంద్రను ఎవరో హత్య చేశారని అతడి తమ్ముడు హతీమ్‌ సింగ్‌ ధన్‌కౌర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సోనియాపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదుచేసిన పోలీసులు సోనియాను అదుపులోకి తీసుకుని విచారించగా.. జితేంద్రను హత్యచేసినట్లు అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన మంచం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement