కూతురి పెళ్లిపై బెంగతో.. | Father Worried About Daughter Marriage End Lives Kamareddy | Sakshi
Sakshi News home page

కూతురి పెళ్లిపై బెంగతో..

Apr 29 2020 1:35 PM | Updated on Apr 29 2020 1:35 PM

Father Worried About Daughter Marriage End Lives Kamareddy - Sakshi

కామారెడ్డి క్రైం:  ఆర్థిక స్థోమత లేకపోవడం, కూతురి పెళ్లి చేయలేక పోతున్నాననే బెంగతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై తావూనాయక్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన తిరునగరి శ్రీనివాస్‌ (47)కు భార్య అరుణ, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్‌ కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో తన కూతురికి వివాహం చేయలేక పోతున్నాని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కా మారెడ్డిలోని రైల్వే బ్రిడ్జికి సమీపంలో గూడ్స్‌ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement