
వరంగల్ అర్బన్: మావోయిస్టు మాజీ నేత గోపన్న అలియాస్ శేషగిరిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో ఈయన మావోయిస్టు దండకారణ్యం కమిటీ మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. కొంతకాలంగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామానికి చెందినవాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.