అమ్మ, చెల్లి జాగ్రత్త నాన్నా..! | Inter Student commits Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

Jul 13 2018 3:24 PM | Updated on Nov 6 2018 8:16 PM

Enter Student commits Suicide In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ :  విజయవాడ గురునానక్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. నితిన్‌ కుమార్‌ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన మయూరీ కాంప్లెక్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో  శుక్రవారం జరిగింది. నితిన్‌ ఆత్మహత్యకి ముందు సూసైడ్‌ లెటర్‌ కూడా రాసినట్లు తెలుస్తోంది. అమ్మ, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రికి లేఖ రాశాడు. విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం అని సమాచారం. 

కార్పొరేట్‌ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement