తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..! | Drinker Fall Into Lalapet Sewer Bridge And Dies From Injuries | Sakshi
Sakshi News home page

తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..!

Jul 3 2019 3:46 PM | Updated on Jul 3 2019 4:23 PM

Drinker Fall Into Lalapet Sewer Bridge And Dies From Injuries - Sakshi

మద్యం మత్తులో తూలుతున్న సదరు వ్యక్తి నాలా గోడపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్టు వెల్లడైంది

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం మత్తులో నాలాలో తూలిపడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లాలాపేట నాల వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాలా గోడను ఆనుకుని నిలుచున్న ఓ వ్యక్తి కాసేపటి తర్వాత దానిపైన కూర్చునే ప్రయత్నం చేశాడు. అయితే, అతను మద్యం సేవించి ఉండటంతో గోడ పైనుంచి తూలిపడిపోయాడు. నేరుగా నాలాలో ఉన్నబండరాయిపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మద్యం మత్తులో తూలుతున్న సదరు వ్యక్తి నాలా గోడపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్టు వెల్లడైంది. తలకు తీవ్ర గాయమవడంతోనే అతను చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement