క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక... | Delhi man suicide Over Unable to pay credit card bills | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక...

Jul 29 2019 10:14 AM | Updated on Jul 29 2019 10:14 AM

Delhi man suicide Over Unable to pay credit card bills - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించిన సంఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య, నాలుగేళ్ల కూతురు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జగత్‌పురి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతను గురుగ్రామ్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. భార్య గృహిణి. అవసరాల నిమిత్తం సదరు వ్యక్తి వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్‌ కార్డులు తీసుకున్నాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు బాకీ పడ్డాడు. దీంతో బ్యాంకులకు చెందిన వ్యక్తులు రికవరీ కోసం తరుచూ ఫోన్, మెసేజ్‌లు చేస్తుండటంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడ్డాడు. 

బంధువులు, స్నేహితులు సాయం అందించకపోవడంతో చివరకు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య, భర్త కూతురితో కలిసి అతను ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. నిద్రపోతున్న పాపను ఎత్తుకుని బిల్డింగ్‌ టెర్రస్‌ పైకి ఎక్కారు. భర్త బిడ్డను భుజాలపై ఎత్తుకుని నాలుగో ఫ్లోర్‌ నుంచి దూకేశారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు చుట్టు పక్కల వారు బయటకు వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. భర్త అక్కడికక్కడే చనిపోగా, భార్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. నాలుగేళ్ల కూతురు కిందకు దూకిన సమయంలో అక్కడ పార్క్‌ చేసిన స్కూటర్‌ సీటుపై పడటంతో చిన్న గాయాలతో బయటపడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement