రామోజీరావు, కిరణ్‌పై ‘అనంత’ కోర్టులో కేసు  | Defamation case filed against Ramoji Rao, his son kiran | Sakshi
Sakshi News home page

రామోజీరావు, కిరణ్‌పై ‘అనంత’ కోర్టులో కేసు 

May 3 2019 2:15 PM | Updated on May 3 2019 2:31 PM

Defamation case filed against Ramoji Rao, his son kiran - Sakshi

సాక్షి, అనంతపురం : ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు, ఎండీ కిరణ్‌పై రిటైర్డ్‌ ఏఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం అనంతపురం మొబైల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రామోజీరావు, కిరణ్‌ వ్యక్తిగతంగా హాజరై అఫిడవిట్‌ సమర్పించాలని, లేదంటే స్టే గడువు పెంచుకోవాలని సూచిస్తూ...తదుపరి విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా రామోజీరావుతో పాటు ఆయన కుమారుడు కిరణ్‌పై వెంకటేశ్వరరావు గతంలో హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఇరువురిపై క్రిమినల్‌, సివిల్‌ కేసులు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ కేసులో రామోజీరావు, కిరణ్‌లు 2012 నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. ఇటీవల సుప్రీంకోర్టు సుదీర్ఘ కాలంగా ఉన్న స్టేలపై కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీర్ఘ కాలంలో ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం నిర్దేశించడంతో ...వెంకటేశ్వరరావు మరోసారి మొబైల్‌ కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement