చితి నుంచి.. పోస్టుమార్టంకు | Dead Body Handed Over For Postmortem While Cremation In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

చితి నుంచి.. పోస్టుమార్టంకు

Jan 18 2019 9:38 AM | Updated on Jan 18 2019 9:38 AM

Dead Body Handed Over For Postmortem While Cremation In Uttar Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముజఫర్‌నగర్‌: చితిపై దహనమవుతున్న మృతదేహన్ని పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని గోథానా గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ మరణించడంతో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే మహిళను అత్తింటివారే చంపారని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చితిపై కాలుతున్న మృతదేహన్ని తీసి పోస్ట్‌మార్టంకు పంపించారు. మహిళ భర్త విజయ్‌పాల్‌తో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేశామని, నిందితులు అందరూ పరారీలో ఉన్నారని పోలీసు అధికారి అమర్దీప్‌ లాల్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement