తెలుగు రాష్ట్రాల్లో నేర వార్తలు..

Crime News In Telugu States - Sakshi

                                దొంగా..దొంగా ఇది మణిరత్నం సినిమా కాదు. నేడు రాజధానిలో ప్రతి వీధిలోనూ ఈ పిలుపు వినని వారు లేరు. ఒకవైపు దోపిడీలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. మరోవైపు హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్నో వృత్తిగా, ప్రవృత్తిగా భావిస్తూ డబ్బును దోచేస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

                                 పొగ తాగిన వాడు దున్నపోతై పుట్టున్‌.. భాద్యతలు మరిచి, వ్యసనాలకు బానిసై పూటుగా మద్యం సేవిస్తున్నారు. ఆపై గంజాయి సేవిస్తూ, గుట్కాను తీసుకుంటూ ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఇళ్లు గుల్ల చేస్తున్నారు. చివరకు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. చిన్న వయసులోనే అసువులు భాస్తున్నారు.

తెలంగాణలో..

సాక్షి, తిరుమలగిరి : దోపిడీ దొంగలు మరో మారు రాజధానిపై తమ పంజా విసిరారు.  తిరుమలగిరిలోని దారుంము 
మిడ్ మైట్‌లోని అపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ సిటిజన్‌ సులోచన ఇంట్లో దొంగలు భీబత్సం సృష్టించారు. నగలు, డబ్బును దోచుకోవడమే కాకుండా అడ్డువచ్చిన ఆమెను పాశవికంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీపుటేజీలను పరిశీలించి, దొంగల కోసం తనిఖీలు చేపట్టారు.

సాక్షి, మంచిర్యాల : దండేపల్లి మండల కేంద్రానికి చెందిన బూసిరాజుల నగేష్ (27) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్నిపంచనామాకు తరలించారు.

సాక్షి, సూర్యాపేట : చివ్వేంల మండలం దూరాజ్పల్లి గ్రామంలో ఇంట్లో అక్రమంగా గుట్కా పాకెట్లను నిల్వ ఉంచారు. వీటి విలువ దాదాపు 12 లక్షల రుపాయాలు ఉంటుంది. వీటిని ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటోను పట్టుకున్నారు. అందులోని గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సాక్షి, పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి యాదవనగర్ వద్ద వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ వ్యక్తి వివరాల కోసం అన్వేషించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనేది విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో..

సాక్షి, వైఎస్సార్‌ : సుండుపల్లి మండలం పెద్దబలిజపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం సేవించి ఇద్దరు యువకులు మృతి చెందారు.వారి కుటుంబ సభ్యులు భోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది.  కల్తీ మద్యం త్రాగడం వల్లే చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఆసుపత్రికి తరలించారు.

సాక్షి, వైఎస్సార్‌ : కమలాపురం మండలం పెద్దచెప్పలిలో గుట్కా అమ్మకాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు ఒక లక్షా యాభై వేలరూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top