వివాహేతర సంబంధం : ముక్కులు కోసేసారు

UP couple noses chopped off over illicit affair  - Sakshi

అయోధ్య:  వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న నెపంతో  ఒక జంట ముక్కులు కోసి పారేసిన ఘటన కలకలం రేపింది.  రామాయణంలో శూర్పణఖ ఘటనను  గుర్తు చేసిన ఈ ఉదంతం అయోధ్య జిల్లాలోని కంద్ పిప్రా గ్రామంలో  చోటు చేసుకుంది.  బాధితులిద్దరూ జిల్లా ఆసుపత్రిలో  చికిత్సపొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం, 23 ఏళ్ల వ్యక్తి వివాహిత మహిళ (30)తో సంబంధం పెట్టుకున్నాడు.  (ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు) మంగళవారం, సదరు వ్యక్తి మహిళ ఇంటికి వచ్చినపుడు. అప్పటికే పథకం ప్రకారం మాటు వేసిన మహిళ మావ, బావ ఇతర కుటుంబ సభ్యులు ఆ జంటని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. అనంతరం  వారి ము‍క్కులు కోసేసారు. ఆ తర్వాత ఆ జంటను ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం  బాధితుల ఆరోగ్యం నిలకడగానే వుందని పోలీసు అధికారి ఆశిష్ తివారీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అలాగే బాధితులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా  గ్రామంలో పోలీసు బలగాన్ని మోహరించినట్టు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top