మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు!

సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్ శ్రీలతపై.. కానిస్టేబుల్ దాడి చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చర్లపల్లి జైలు నుంచి ఓ నిందితుడిని జడ్చర్ల కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి చర్లపల్లి జైలుకు తీసుకెళ్తున్న క్రమంలో జడ్చర్లలో హైద్రాబాద్–2 బస్‌డిపోకు చెందిన బస్సు ఎక్కారు. అనంతరం టికెట్ తీసుకోవాలని కోరిన కండక్టర్‌తో కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్ గొడవపడి దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఇందుకు బాధ్యులైన కానిస్టేబుల్ రామకృష్ణగౌడ్‌తో పాటు మరో హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డిని సైతం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి