కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత

Constable Shot Dead By Terrorists In Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌ : బక్రీద్‌ పర్వదినం వేళ కశ్మీర్‌లో మళ్లి అలజడి మొదలైంది. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం పాకిస్తాన్‌, ఐసీస్‌ జెండాలు దర్శనమిచ్చాయి .బక్రీద్ వేడుకల సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు జరిపిన అనంతరం శ్రీనగర్ వీధుల్లో పాక్, ఐసీస్ జెండాలతో ఆందోళన చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ఆందోళకారులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో నిరసన కారులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారత బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి.

కాగా మరో చోట ఓ పోలీసుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఫయాజ్‌ అహ్మద్‌ అనే ట్రైనీ కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. బక్రీద్‌ కావడంతో స్థానికంగా ఉన్న మసీద్‌కు వెళ్లి ప్రార్థనలు ముగించుకొని తిరిగివస్తున్న నేపథ్యంలో అతనిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పుల్వామా జిల్లాలో బీజేపీ అనుకూల నాయకుడు షభ్బీర్‌ అహ్మద్‌ భట్‌ను కూడా ఈ రోజు తెల్లవారు జామున ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. వరుస ఘటనలతో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇది కూడా చదవండి
బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని..

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top