డేరా బాబాకు మరో దెబ్బ | Chandigarh HC Quash Gurmeet Petition | Sakshi
Sakshi News home page

గుర్మీత్‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Oct 9 2017 11:27 AM | Updated on Oct 9 2017 1:07 PM

Chandigarh HC Quash Gurmeet Petition

సాక్షి, ఛండీగఢ్‌ : డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుర్మీత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛండీగఢ్‌ హైకోర్టు కొట్టేసింది. బాధిత మహిళల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గుర్మీత్‌ వాదనను తోసిపుచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ అతను ఈ పిటిషన్ దాఖలు చేశాడు. 

కాగా, ఇద్దరు సాధ్వీలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల శిక్షను గుర్మీత్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుర్మీత్ తరపున ఏ వాదనతో కూడా కోర్టు అంగీకరించలేకపోయింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా సీబీఐ న్యాయస్థానం తీర్పును సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement