పెళ్లి ఇష్టం లేక ఉరి వేసుకున్న యువతి | Bride Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేక ఉరి వేసుకున్న యువతి

Feb 10 2020 10:12 AM | Updated on Feb 10 2020 10:12 AM

Bride Commits Suicide in Hyderabad - Sakshi

లాలాపేట: మరో నాలుగు రోజుల్లో వివాహం కావాల్సిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట వినోబానగర్‌కు చెందిన రాళ్లబండి జ్ఞానేశ్వరి కూతురు రాళ్లబండి మమత (22)కు, భరత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడితో ఈ నెల 13న వివాహం జరగనుంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటలకు మమతను ఇంట్లో ఒంటరిగా వదిలి తల్లి జ్ఞానేశ్వరి  పెళ్లి షాపింగ్‌ కోసం బయటకు వెళ్లింది.

షాపింగ్‌ ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం   వచ్చిన ఆమె పక్కింటి వ్యక్తి సహాయంతో తలుపులు తెరవగా.. మమత స్కిప్పింగ్‌ తాడుతో స్లాబ్‌ హుక్కుకు ఉరి వేసుకుని వేలాడుతూ   కనిపించింది. జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు నిర్ణయించిన వివాహం నచ్చకపోవడంతోనే మమత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు  ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement