రామాలయంలో బ్యాగు కలకలం | Bomb Threat in Ramalayam | Sakshi
Sakshi News home page

రామాలయంలో బ్యాగు కలకలం

May 26 2018 1:34 PM | Updated on May 26 2018 1:34 PM

 Bomb Threat in Ramalayam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఓ భక్తుడు వదిలేసిన బ్యాగుతో కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి కోవెలకు సమీపంలో ఓ భక్తుడు బ్యాగు వదిలిపెట్టి వెళ్లాడు. అది చాలా సేపు అక్కడే ఉంది. ఆలయ సిబ్బంది దాని ని చూసి, సెక్యూరిటీ వారికి సమాచారం ఇవ్వటం తో వారు దానిని పరిశీలించారు.

అయితే బ్యాగు పై అనుమానం కలుగటంతో బాంబ్‌స్క్వాడ్‌ బృం దానికి సమాచారం ఇచ్చారు. బ్యాగులో ఏదో ఉం దని ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు. బాంబుస్క్వాడ్‌ బృందం  వచ్చి ఆ బ్యాగును నిశితంగా పరిశీలించగా అందు లో భక్తులకు సంబంధించిన కొబ్బరికాయ, బట్ట లు ఉన్నాయి. దీంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీ ల్చుకున్నారు. బ్యాగుకు సంబంధించిన భక్తులెవ్వరూ రాకపోవటంతో దానిని ఆలయ సిబ్బంది ఆధీనంలో ఉంచుకున్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement