బొలేరో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు  | Bolero Max vehicle roll over..15 wounded laborers | Sakshi
Sakshi News home page

బొలేరో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు 

Mar 20 2018 7:01 AM | Updated on Mar 20 2018 7:01 AM

Bolero Max vehicle roll over..15 wounded laborers - Sakshi

గాయపడిన మహిళలు

కారేపల్లి: మిర్చి తోట ఏరుటకు వచ్చిన కూలీలతో ఉన్న బొలేరో మ్యాక్స్‌ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని గుడితండా–చీమలపాడు రహదారి మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన 15 మంది మహిళా కూలీలు సోమవారం కారేపల్లి మండలంలోని గుడితండా గ్రామంలో మిర్చి ఏరుటకు వచ్చారు.

సాయంత్రం తిరుగు ప్రయాణంలో గుడితండా–చీమలపాడు బీటీ రోడ్డు మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మరో వాహనంలో ఇల్లందు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement