పోలీస్‌ జీప్‌ నంబర్‌తో మరో బైక్‌ | One Number plate Two vehicle In Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీస్‌ జీప్‌ నంబర్‌తో మరో బైక్‌

Aug 14 2024 7:14 AM | Updated on Aug 14 2024 12:53 PM

One Number plate Two vehicle In Hyderabad

సిరిసిల్లలో బోలెరో.. ఖమ్మంలో టూవీలర్‌   

యాప్‌లో బైక్‌ నంబర్‌పై చలాన్లు 

సిరిసిల్లటౌన్‌: ఈ ఫొటోలు రెండూ చూశారా.. ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్‌ బోలెరో వాహనం. మరోటి ఖమ్మం జిల్లా జలగంనగర్‌లోని బైక్‌. ఈరెండు వాహనాల నంబర్లు టీఎస్‌09పీసీ 4009గా ఉన్నాయి. సాధారణంగా పోలీస్‌ వాహనాలకు టీఎస్‌09పీసీ సిరీస్‌తో నంబర్లు అలాట్‌ అవుతుంటాయి. కానీ, ఖమ్మం జిల్లాలోని జలగంనగర్‌లో కూడా ఓ వ్యక్తి బైక్‌ నంబరు సిరిసిల్ల పోలీస్‌ బోలెరో వాహనం ఒకటే కావడం విశేషం. 

పైగా ఖమ్మంలో ఓ వ్యక్తి హెల్మెట్‌ లేకుండా బైక్‌పై వెళ్తుండగా అక్కడి పోలీసులు ఫొటో తీసి ఏప్రిల్‌ 30న ఆన్‌లైన్‌ ద్వారా రూ.100 పెనాల్టీ విధించారు. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఈ–చలాన్‌లో బైక్‌ యజమాని పేరు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ టీఎస్‌ ఉండటం విశేషం. అయితే రెండింటిలో ఏది అసలు.. ఏది నకిలీ అనేది తేలాల్సి ఉంది. ఈవిషయమై సిరిసిల్ల టౌన్‌ సీఐ కృష్ణను వివరణ కోరగా.. ఈఅంశంపై ఖమ్మం పోలీస్‌ సహకారంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement