
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని పురూలియా జిల్లాలో బీజేపీ కార్యకర్త త్రిలోచన్ మహతో(20) బుధవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. నైలాన్ తాడుతో త్రిలోచన్‌ను ఉరితీసిన దుండగులు.. అతని మృతదేహం వద్ద ఓ హెచ్చరిక నోట్‌ను ఉంచారు. అందులో.. ‘18 ఏళ్ల వయసు నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నందుకే చంపేశాం. నీకు ఓటు హక్కు వచ్చినప్పటినుంచి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కుదిరింది’ అని రాశారు. త్రిలోచన్ ధరించిన షర్ట్‌పైనా ఇదే హెచ్చరికను రాశారు. కాగా, తమ యువకార్యకర్త ఒకరు బెంగాల్‌లో దారుణహత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని బీజేపీ చీఫ్ అమిత్ వ్యాఖ్యానించారు.