పాలిథిన్‌ కవర్‌లో పసికందు | Sakshi
Sakshi News home page

పాలిథిన్‌ కవర్‌లో పసికందు

Published Fri, Aug 3 2018 10:20 AM

Baby In Polyethylene Cover - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి రంగారెడ్డి : పేగుబంధాన్ని మరిచారు. ఏ తల్లి కన్నబిడ్డో పాపం రోడ్డున పడేశారు. అప్పుడే పుట్టిన పసికందు పాలిథిన్‌ కవర్‌లో శవమై కనిపించింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి ప్రాంతంలో రోడ్డుపైన ఓ ప్లాస్టిక్‌ కవర్‌ పడి ఉంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్ధ్య కార్మికులు కవర్‌ను పరిశీలించి చూడగా అందులో పసికందు కనిపించింది.

ప్రాణాలతో ఉంటుందని స్థానికులు చూడగా.. అప్పటికే మృతి చెందింది. శిశువు మృతదేహం గురించి స్థానికులను అడిగినా.. ప్రయోజనం లేకుండాపోయింది. శిశువును ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకువచ్చి ఎవరో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల సాయంతో శిశువును స్థానికంగా ఉన్న శ్మశానవాటికలో కననం చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement