అరుణ్‌ కేసుపై ఆరా తీస్తున్నాం  

Arun case is being investigated - Sakshi

ఏడాది తర్వాత తిరిగిరావడం సంతోషకరం

బాలుడిని తల్లిదండ్రికి అప్పగించిన సీఐ అశోక్‌కుమార్‌

యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్‌ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్‌ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్‌–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.

అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. 

గారాబంగా చూసుకున్నారు : అరుణ్‌

తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్‌లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్‌ అంకుల్‌కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు.

ఎవరా అగంతకుడు..?

బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్‌ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు.

ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top