అరకు ఎంపీకి బెదిరింపు మెయిల్స్‌ | Araku Mp Kothapalli Geetha Receiving Fake Calls And Mails | Sakshi
Sakshi News home page

అరకు ఎంపీకి బెదిరింపు మెయిల్స్‌

Nov 23 2017 3:42 PM | Updated on Nov 23 2017 4:33 PM

 Araku Mp Kothapalli Geetha Receiving Fake Calls And Mails - Sakshi - Sakshi

' నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల ఫైల్‌ ఏసీబీ కార్యాలయంలో ఉంది.

సాక్షి, విశాఖపట్నం: ' నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల ఫైల్‌ ఏసీబీ కార్యాలయంలో ఉంది. వివరాలు కావాలంటే నా ఎస్‌బీఐ అకౌంట్‌లో డబ్బులు వేయండి' అంటూ ఓ ఆగంతకుడు విశాఖ జ్లిలా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు మెయిల్స్‌ పంపాడు. బెదిరింపు మొయిల్స్‌తో ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాఖ కమిషనర్‌ ఈ సంఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

డబ్బులు అడుగుతూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, తనకే కాక చాలామంది ఎంపీలకు డబ్బుల కోసం బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని చెప్పారు. ఫేక్ కాల్స్, మెయిల్స్‌ పై బ్యాంకులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల తన కుమారుడి అకౌంటు నుంచి రూ. 12 వేలు మాయమయ్యాయని.. ఎనిమిది నెలలైనా బ్యాంకుల నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. సైబర్‌ క్రైమ్‌ అంశాలపై పార్లమెంటు సమావేశాలలో  లేవనెత్తుతానన్నారు. సైబర్ క్రైమ్ చట్టాన్ని పటిష్టం చేయాలని పార్లమెంటులో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడతానని గీత చెప్పారు. సైబర్ క్రైమ్ ఘటనలను కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement