బిడ్డతో సహా నటి మృతి

Actress And Her Newborn Die Over Fails To Get Ambulance In Maharashtra - Sakshi

ముంబై : అంబులెన్స్‌ రాక ఆలస్యమైన ఘటనలో మరాఠి నటిపూజా జంజర్‌(25) మృత్యువాతపడ్డారు. పూజతో పాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేస్తోంది. వివరాలు... ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ప్రాథమిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది.

ఈ నేపథ్యంలో పూజను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. అయితే అప్పటికే అర్ధరాత్రి దాటడంతో అంబులెన్స్‌ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా సేపటికి ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఆస్పత్రికి రావడంతో పూజను అందులో హింగోలికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా పలు మరాఠీ సినిమాల్లో నటించిన పూజ.. గర్భవతిగా ఉన్న నాటి నుంచి సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top