బాధ్యులను కఠినంగా శిక్షించాలి  | Accused Should Be punished Severely | Sakshi
Sakshi News home page

బాధ్యులను కఠినంగా శిక్షించాలి 

Jul 16 2018 1:10 PM | Updated on Sep 2 2018 4:52 PM

Accused Should Be punished Severely - Sakshi

వంగర : మగ్గూరు గ్రామంలో గిరిజన మహిళపై దాడి చేసి కులం పేరుతో దుర్భాషలాడిన సర్పంచ్‌ గంటా ఖగేంద్రనాయుడుతోపాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పాలవలస విక్రాంత్‌లు డిమాండ్‌ చేశారు. ఆదివారం మగ్గూరులో పర్యటించి బాధితురాలు తూడి అప్పలనరసమ్మను పరామర్శించారు. ఘటనకు దారి తీసిన అంశాలపై ఆరా తీశారు.

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజన మహిళపై దాడి అమానుషమన్నారు. దాడికి కారణమైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారే తప్ప ఇంత వరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. నిందితులంతా టీడీపీ వర్గానికి చెందిన వారు కావడంతో కేసులో పురోగతి ఉండడం లేదని ఆరోపించారు.

తక్షణమే పోలీస్‌ యంత్రాంగం రంగంలోకి దిగి బాధ్యులుపై చర్యలు చేపట్టి బాధితురాలికు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, ఉదయాన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కర్రి గోవిందరావు, ఉగిరి ముత్యాలు, గొట్టాపు సత్యన్నారాయణ, పోలిరెడ్డి రామకృష్ణ, కొచ్చెర్ల తవిటయ్య, వేగిరెడ్డి మురళీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement