
జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
రాంచీ : జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గుమ్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు నిన్న పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. మహవగరీ జరిపిన తనిఖీల్లో 17 టిఫిన్ బాంబులు, 200లకు పైగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.