
అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ మాల్ వద్ద మంటలను అదుపు చేస్తోన్న సిబ్బంది
రష్యా : సైబీరియా రాష్ట్రం కెమెరోవో పారిశ్రామిక నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ప్రమాదంలో 37 మంది మృతిచెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొంతమంది అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ మాల్ కిటీకీల నుంచి దూకడంతో చనిపోయినట్లు తెలిసింది. ఈ నగరం రాజధాని మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.