డ్యాంలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి | 3 Chennai Students Drown In Pune Dam | Sakshi
Sakshi News home page

డ్యాంలో మునిగి ముగ్గురు తమిళ విద్యార్థుల మృతి

Apr 26 2018 11:19 AM | Updated on Apr 26 2018 11:19 AM

 3 Chennai Students Drown In Pune Dam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పూణె : డ్యాంలో మునిగి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. చెన్నైలోని ఈసీఎస్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు నలుగురు టీచర్లతో కలసి సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా మహారాష్ట్రలోని ముల్షి తాలూకాకు వచ్చారు. ఉపాధ్యాయులకు తెలియకుండా ముగ్గురు విద్యార్థులు ఈత కొడదామని దగ్గరలో ఉన్న ఓ డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాంలోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు.

ఈ విషయం తెలిసి వారితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దానిష్‌ రాజా అనే విద్యార్థి మృతదేహం లభించింది. సంతోష్‌, సర్వన్న అనే ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది. తప్పిపోయిన విద్యార్థులు 13 ఏళ్లలోపు వారే. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement