టీవీ మీదపడి చిన్నారి మృతి 

18 Months girl Child Died In Nalgonda - Sakshi

సాక్షి, పెద్దవూర(నల్గొండ) : టీవీ మీద పడి 18నెలల చిన్నారి మరణించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ ఆలియాస్‌ దుర్గమ్మకు ఆరేళ్లక్రితంకనగల్‌ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన శంకరయ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె స్మైలీ(18నెలలు). కొన్నినెలల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పద్మ తన తల్లిగారు ఊరు అయిన బట్టుగూడెం గ్రామానికి వచ్చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం కావడంతో తన ఇద్దరి పిల్లలను తల్లి మండారి ముత్యాలమ్మ వద్ద ఉంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది.  ముత్యాలమ్మ సోమవారం పెద్ద మనుమరాలిని బడికి పంపించింది.

చిన్న మనుమరాలు స్మైలి ని తన వద్దనే ఉంచుకుంది. ము త్యాలమ్మ వంట చేస్తున్న క్రమంలో స్మైలీ ఆడుకుంటూ ఇంట్లోని టీవీ వద్దకు వెళ్లి స్టాండ్‌ను లాగింది. ఆ టీవీ చిన్నారి మీదపడడంతో చెవుల నుంచి రక్తస్రావం కావడంతో చికిత్స నిమి త్తం పెద్దవూరకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందింది. చిన్నారి మరణవార్త విన్న తల్లి పద్మ హుటాహుటిన బట్టుగూడెం గ్రామానికి చేరుకుంది.  ఆల్లారుముద్దుగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top