16 ఏళ్ల బాలిక‌పై అఘాయిత్యం | 16 Year Old Woman Molested By Three Men In Delhi | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల బాలిక‌పై అఘాయిత్యం

Jun 16 2020 1:08 PM | Updated on Jun 16 2020 1:21 PM

16 Year Old Woman Molested By Three Men In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ :  స్వ‌స్థ‌లానికి చేరుస్తామంటూ 16ఏళ్ల బాలిక‌పై ముగ్గురు దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..ఓ ఇంట్లో ప‌నిమ్మాయిగా ప‌నిచేస్తున్న బాలిక త‌న స్వ‌స్థ‌ల‌మైన జార్ఖండ్ వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేష‌నుకు  చేరుకుంది. అక్క‌డ ముగ్గురు వ్యక్తులు ఆమెను ఇంటికి చేరుస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ నిర్మానుష్య ప్రాంతానికి   తీసుకెళ్లి  మ‌త్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌ను బ‌ల‌వంతంగా తాగించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. స్పృహ త‌ప్పి ప‌డిపోయి ఉన్న ఆమెను  గ‌మ‌నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ బాలిక‌ను  స్టేష‌నుకు తీసుకెళ్లి విచారించ‌గా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కేసు  న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం బాలికకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి శిశు సంక్షేమ క‌మిటీకి అప్ప‌గించిన‌ట్లు అధికారి ఒక‌రు పేర్కొన్నారు. (మరదలిపై వ్యామోహంతో భార్యను..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement