శంఖవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్‌ | 144 Section In Shankhavaram East Godavari | Sakshi
Sakshi News home page

శంఖవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

Sep 8 2018 7:27 AM | Updated on Sep 8 2018 7:27 AM

144 Section In Shankhavaram East Godavari - Sakshi

మృతదేçహాలను చూసి విలపిస్తున్న బంధువులు

తూర్పు గోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీ పేటలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంలో బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్‌ సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ పేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ రెవెన్యూ, పోలీస్‌ ఉన్నత అధికారుల ఆదేశాల 144 సెక్షన్‌ శుక్రవారం కూడా కొనసాగింది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు జరగకుండా ఎస్సీ పేటలో ప్రతి వీధిలో పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌ వెంకట రామారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.

మృతదేహాలు అప్పగింత..
సజీవదహనమైన మృతులు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు స్వగ్రామానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహలను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు నిలకడగా ఉండే వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎసై.పార్ధసారథి, తహసీల్దార్‌ ఎం సుజాత వివరించారు. హత్యాకాండకు బాధ్యులైన పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సీఎచ్‌వీ రామారావు విలేకర్లకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement