
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52వ రోజు ప్రజాసంకల్పయాత్ర కురవపల్లి వద్ద ముగిసింది. ఆయన ఇవాళ 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అసిపిరెడ్డిగారి పల్లి, కొత్తపల్లి క్రాస్, కరివేండ్లపల్లి క్రాస్, ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లి, పెద్దురు, చెరువుముందరిపల్లి, చెనకవారిపల్లి మీదగా కురవపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. పాలమందపెద్దూరు, చెరువుముందరపల్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఇప్పటివరకూ ఆయన 728.4 కిలోమీటర్ల నడిచారు.
53వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైఎస్ జగన్ 53వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పుంగనూరు నియోజకవర్గం కురవపల్లి శివారు నుంచి ఆయన శుక్రవారం ఉదయం పాదయాత్రను ప్రారంభిస్తారు. గండ్లపల్లి, కంభంవారిపల్లి, కందూరు క్రాస్, సదాం, భట్టువారిపల్లి, గొడ్కవారిపల్లి వరకూ ప్రజసంకల్పయాత్ర కొనసాగనుంది.