ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్ | Zomato suffers a likely security breach, 17 million accounts 'hacked' | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్

May 18 2017 10:46 AM | Updated on Sep 5 2017 11:27 AM

ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్

ఆ కంపెనీ 170లక్షల అకౌంట్లు హ్యాక్

జోమాటోకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు సెక్యురిటీ బ్లాక్ హ్యాక్ రీడ్ రిపోర్టు చేసింది.

డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్.. దొంగలించిన డ్రగ్స్, ఆయుధాలు, డేటా బేస్, నకిలీ డాక్యుమెంట్ల విక్రయానికి ఇదే అడ్డా. ఈ అడ్డా వలలో ఇప్పుడు దేశీయ అతిపెద్ద ఆన్ లైన్ రెస్టారెంట్ గైడ్ జోమాటో చిక్కుకుంది.  జోమాటోకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు సెక్యురిటీ బ్లాక్ హ్యాక్ రీడ్ రిపోర్టు చేసింది.. ఈ డేటా బేస్ లో రిజిస్ట్రర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లు ఉన్నాయి. దొంగలించిన డేటా జుమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడని హ్యాక్ రీడ్ తెలిపింది. దీంతో జోమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమవుతోంది.
 
ఆ డేటా మొత్తాన్ని 1,001.45 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు చేస్తోంది. అమ్మకందారుడు ఎన్క్లే పేరుతో ఈ డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి వచ్చినట్టు తెలిసింది. జోమాటోలో రిజిస్ట్ర్ అయిన ప్రతి కస్టమర్ ఫోన్ నెంబర్, అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ వారిదగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ హ్యాకింగ్ కనుక నిజమైతే,  ఇండియన్ ఐటీ యాక్ట్ సెక్షన్ 43ఏ కింద జోమాటోనే యూజర్ల వ్యక్తిగత డేటాకు బాధ్యత వహించి, పరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ సైబర్ లా, సైబర్ సెక్యురిటీ ఎక్స్ పర్ట్ ప్రశాంత్ మలి చెప్పారు. 20 కి పైగా దేశాల్లో జోమాటో యప్ ను వాడుతున్నారు. నెలకు 90 మిలియన్ కు పైగా యూజర్లు ఈ యాప్ ను వాడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement