భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

Yes Bank Shares Slump Nearly 20 percent After Q1 Earnings Miss  - Sakshi

20శాతం నష్టపోయిన యస్‌ బ్యాంకు షేరు

క్యూ1 లో 91 శాతం క్షీణించిన లాభాలు

మార్కెట్‌ క్యాప్‌ ఢమాల్‌

సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్‌ బ్యాంక్‌కు ఫలితాల షాక్‌ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్‌ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప‍్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్‌ క్యాప్‌ అని  గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. 

క్యూ1 ఫలితాలు
బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాల్లో యస్‌ బ్యాంక్‌ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే  త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్‌ బ్యాంక్‌ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top