కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4' | Xiaomi Redmi Note 4 With 4100mAh Battery, USB Type-C Port Launched | Sakshi
Sakshi News home page

కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4'

Aug 25 2016 12:39 PM | Updated on Sep 4 2017 10:52 AM

కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4'

కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4'

చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం షావొమీ మరో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది.

చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావొమీ మరో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. 'రెడ్మి నోట్ 4' పేరుతో కొత్త ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తాయి. 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజీ మోడల్ ధర దాదాపు రూ.9 వేలు. 64 జీబీ మోడల్ ధర సుమారు. 12 వేలు. ఆగస్టు 26 నుంచి కంపెనీ ఆన్లైన్ స్టోర్లు, ఎంఐ డాట్ కామ్ లో వీటిని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఇవి చైనాలో మాత్రమే లభ్యమవుతాయి.

యూఎస్బీ టైప్ సీ-మోడల్ ను సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్ కలిగిన మొదటి స్మార్ట్ఫోన్ తమదేనని షావొమీ పేర్కొంది. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని కలిగిన రెడ్మి నోట్ 4 హైబ్రీడ్ సిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది.

ఫీచర్లు
2.1 జీహెచ్ జడ్ ప్రాసెసర్
5.5 ఫుల్ హెచ్డీ స్క్రీన్
2.5 కర్వర్డ్ గ్లాస్ డిస్ ప్లే
5 మెగా ఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ప్రింట్ స్కానర్
4100 ఏంఏహెచ్ బ్యాటరీ
4జీ వోల్టీ సపోర్ట్
ఫోన్ బరువు 175 గ్రాములు

Advertisement
 
Advertisement
Advertisement