పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది: జియో భారీ ఆఫర్‌

Xiaomi Poco F1 Master of speed launched - Sakshi

6జీబీ+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  ధర రూ. 20,999

6జీబీ+128జీబీ స్టోరేజ్‌  రూ. 23,999

 8జీబీ+256జీబీ స్టోరేజ్‌ రూ. 28,999

ఆర్మర్డ్ ఎడిషన్ 8జీబీ+256జీబీ స్టోరేజ్‌  రూ. 29,999

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ షావోమి సబ్‌బ్రాండ్ పోకో స్మార్ట్‌ఫోన్‌ అభిమానులకు ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళితో వస్తోంది. భారత మార్కెట్‌లోకి సరికొత్త పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  భారత్‌లో పోకో ఫోన్ ఎఫ్1 ప్రారంభ ధర రూ.20999గా నిర్ణయించింది. ఆగస్టు, 29 మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయానికి లభించనుంది. ఇక లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే రిలయన్స్‌ జియో భారీ ఆఫర్‌ అందిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రూ.8 వేల తక్షణ ప్రయోజనాలను కస‍్టమర్లకు ఆఫర్‌ చేయనుంది. అదీ 6టీబీ హైస్పీడ్‌ డేటాతో. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌ఎసీ కార్డు ద్వారా కొనుగోళ్లపై  వెయ్యి రూపాయల తగ్గింపును అందించనుంది.

పోకో  ఎఫ్‌ 1 ఫీచర్లు
6.18 అంగుళాల డిస్‌ప్లే
1080x2160  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్ 845
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా,
4000ఎంఏహెచ్ బ్యాటరీ
మాస్టర్‌ ఆఫ్‌ స్పీడ్‌ గా ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితరఫీచర్లతో  బ్లూ, గ్రే రంగుల్లో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top